Komati Reddy: కేటీఆర్ కు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు 5 d ago
TG : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు రేసింగ్ కేసులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్ కు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉండదన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని, ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శబరిమలకు వెళ్లడానికి నల్ల దుస్తులు ధరించినట్టుందని హేళన చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావాలని శబరిమలకు వెళ్లి మొక్కుతారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.